భారతదేశం, అక్టోబర్ 8 -- తెలంగాణలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, మంత్రి పొన్నం క్షమాపణలు చెప్పాలని మరోమంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా అయ్యేలా కనిపించింది. దీంతో టీపీసీసీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో ఇద్దరు మంత్రులు సమావేశం అయ్యారు. మహేశ్ గౌడ్ చొరవతో మంత్రులు మధ్య వివాదం ముగిసింది.

ఈ సమావేశంలో పొన్నం, అడ్లూరి, మహేశ్ గౌడ్‌తోపాటుగా మంత్రి వాకిటి శ్రీహరి,ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, శివసేన రెడ్డి , సంపత్ కుమార్, అనిల్, వినయ్ కుమార్ ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్.. కాంగ్రెస్ పార్ట...