భారతదేశం, జూన్ 23 -- రెంటపాళ్ల కారు ప్రమాదం కేసులో నిందితుడిగా తన పేరును చేర్చిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడికి ట్వీట్ చేశారు. తాను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు.

''@ncbn గారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు.

*చంద్రబాబు గారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కాని, మీ పవన్‌కళ్యాణ్‌ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?

*ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?

*ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్య...