భారతదేశం, అక్టోబర్ 29 -- టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సీసిరోలియో.. మాస్ జాతర ప్రీరిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఈరోజు బతికి ఉండటానికి కారణంగా రవితేజ సర్ అని అతడు అనడం గమనార్హం. తనను ఆదుకున్న దేవుడు, తన కోసం నిలబడిన వ్యక్తి, శక్తి, వ్యవస్థ రవితేజ అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.

రవితేజ, శ్రీలీల నటించిన మాస్ జాతర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం (అక్టోబర్ 28) రాత్రి జరిగిన విషయం తెలుసు కదా. ఈ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సీసిరోలియో చాలా ఎమోషనల్ అయ్యాడు. తాను, తన కుటుంబం ఇవాళ బతికి ఉండటానికి కారణం రవితేజ సర్ అని అతడు చెప్పాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట రవితేజ చేసిన సాయం గురించి పాట రూపంలో పాడాడు. ఆ తర్వాత మాట్లాడాడు.

"నేను ఇవాళ ఓ వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. నేను ధమాకా చేసినప...