భారతదేశం, డిసెంబర్ 19 -- రోషన్ మేకా, అనస్వర రాజన్ కలిసి నటిస్తున్న ఛాంపియన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం (డిసెంబర్ 18) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు గెస్టుగా వచ్చిన రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాము ఎలా నటిస్తామో కూడా తెలియకపోయినా తమకు మొదటి అవకాశం ఇచ్చిన అశ్వినీ దత్, వైజయంతీ మూవీస్ కు అతడు థ్యాంక్స్ చెప్పాడు.

ఛాంపియన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ తనతోపాటు ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబులకు తొలి అవకాశం ఇచ్చిన అశ్వినీ దత్ కు కృతజ్ఞతలు తెలిపాడు.

"చాలా మంది హీరోలకు అంటే ఎన్టీఆర్ కు స్టూడెంట్ నంబర్ 1, అల్లు అర్జున్ కు గంగోత్రి, మహేష్ బాబుకు రాజకుమారుడు, నాకు చిరుత.. మా అందరికీ కామన్ గా ఉన్న వ్యక్తి దత్తు గారికి, వైజయంతీ మూవీస్ కు మనస్ఫూర్తిగా థ్యాంక్స్. మేము వచ్చిన కొత్తలో ఎంతో మంది ప్రొడ్యూ...