Andhrapradesh, జూన్ 14 -- వేలాది మంది నేతన్నలకు లబ్దిచేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలను పెంచేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు.

రాష్ట్రంలో దాదాపుగా 1,036 చేనేత సహకార సంఘాలున్నాయని, వాటిలో 89 వేల మగ్గం నేత కార్మికులు ఉన్నారన్నారు. వీరందరికీ ఆర్థికంగా ఊతం ఇచ్చే విధంగా, వారి జీవనోపాధి మెరుగుపడే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను గణనీయంగా పెంచడం జరిగిందన్నారు. ఏపీసీవోకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలు కింద పనిచేసే నేత కార్మికులకు వేతనాలు మరియు ఛార్జీల పెంపు వర్తిస్తుందన్నారు.

బ్లీచింగ్ ఛార్జీలు బండిల్‌కు రూ.129...