Andhrapradesh, ఆగస్టు 2 -- ఏపీలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం కింద మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ఈ నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి వర్తింపజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో మగ్గాల మీద 50 వేల నేతన్నలు, మర మగ్గాలపై 11,500ల మంది ఆదారపడి జీవిస్తున్నారు. వారందరికీ ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేసేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500ల ఉచితంగా అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా రూ.125 కోట్ల మేర భారం పడనుంది.

ఉచిత విద్యుత్ పథకం అమలు తీరుతెన్నులపై పెన్షప్ల పండగ నిమిత్తం కడప పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుతో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత చర్చిం...