Andhrapradesh, ఆగస్టు 6 -- చేనేత రంగానికి ఊతమిచ్చేలా... నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం చేనేత శాఖపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. చేనేత కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై చర్చించారు. వ్యవసాయం తర్వాత చేనేతే అత్యంత కీలకమైన రంగంగా ఉందని.. దీని మీద ఆధారపడిన వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.

ఈ మేరకు ఇటీవల జమ్మలమడుగు పర్యటనలో ఓ చేనేత కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో తన దృష్టికి వచ్చిన అంశాలను సమీక్షలో చంద్రబాబు ప్రస్తావించారు. మగ్గాలకు 200 యూనిట్లు.. అలాగే పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఈ ...