భారతదేశం, జనవరి 26 -- భారత స్టాక్​ మార్కెట్​లకు నేడు, సోమవారం- 2026 జనవరి 26న సెలవు ఉంటుంది. 77వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఈ రోజు బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో ట్రేడింగ్​ కార్యకలాపాలు జరగవు. అంటే శుక్రవారం తర్వాత సూచీలు తిరిగి మంగళవారమే ఓపెన్​ అవుతాయి.

ఈక్విటీ మార్కెట్లతో పాటు కరెన్సీ మార్కెట్ కూడా నేడు మూతపడనుంది. అయితే, కమోడిటీ మార్కెట్ విషయానికి వస్తే.. ఉదయం సెషన్ నిలిపివేసినప్పటికీ, సాయంత్రం సెషన్ మాత్రం ట్రేడింగ్ కోసం తెరుచుకుంటుందని ఎక్స్​ఛేంజ్ డేటా వెల్లడించింది. నేటి సెలవు తర్వాత, తదుపరి మార్కెట్ సెలవు మార్చి 3, 2026న హోలీ పండుగ సందర్భంగా ఉండనుంది.

జనవరి 15 (గురువారం): మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.

జనవరి 26 (సోమవారం): గణతంత్ర దినోత్సవం.

మార్చి 3 (మంగళవారం): హోలీ.

మార్చి 26 (గురువారం): శ్రీరామ నవమి.

మార్చి 31 (మంగళవారం)...