భారతదేశం, డిసెంబర్ 26 -- బంగారం కొనాలనుకునే సామాన్యులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి ధరలు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాల మధ్య, అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. శుక్రవారం (డిసెంబర్ 26) ట్రేడింగ్ ప్రారంభంలోనే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర 0.65% పెరిగి రూ. 1,38,994 వద్ద రికార్డు స్థాయిని తాకింది. ఆ తర్వాత ఉదయం 10 గంటల సమయానికి మరింత పుంజుకుని ఏకంగా రూ. 1,39,181 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ పసిడి ధరలు ఒక శాతం మేర పెరిగాయి. మన భాగ్యనగరంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న తాజా ధరలను ఒకసారి పరిశీలిద్దాం.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగ...