Hyderabad, అక్టోబర్ 1 -- నవరాత్రి ఉత్సవాల్లో మహిషాసుర మర్దిని అవతారం విశిష్టత విశేషంగా పరిగణించబడుతుంది. మహిషాసుర మర్దిని రూపం అతి ప్రధానమైనది. ఈ అవతారం శక్తి, ధైర్యం, న్యాయం, ధర్మ పరిరక్షణలకు సంకేతంగా నిలుస్తుంది. పురాణ కథనం ప్రకారం.. మహిషాసురుడు అనే అసురుడు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అమోఘ శక్తులు పొందాడు.

దేవతలు, ఋషులు, మానవులను దౌర్జన్యాలకు గురి చేస్తూ లోకాన్ని కలవరపరిచాడు. ఆ సమయంలో దేవతల సమిష్టి శక్తి నుంచి వెలిసిన దుర్గామాతే మహిషాసుర మర్దిని. సింహ వాహనంతో విరాజిల్లుతూ, అష్టదశ భుజాలతో ఆయుధాలను ధరించి, ఆమె మహిషాసురుని వధించి ధర్మాన్ని స్థాపించారు.

దేవాలయాల్లో ఈ అవతారాన్ని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శించడం గొప్ప అనుభూతి. ఈ రూపం భక్తులక...