Warangal,telangana,elkathurthy, ఏప్రిల్ 27 -- తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీకి 25 సంవత్సరాలు నిండాయి. 2001లో టీఆర్ఎస్ ఏర్పడగా. 14 ఏళ్లపాటు తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం పోరాడుతూ వచ్చింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లపాటు అధికారంలో కొనసాగింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. అయితే పార్టీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇవాళ భారీ సభను తలపెట్టింది.

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. మొత్తం 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభను నిర్వహించనుంది. అయితే మహాసభ (ప్రధాన వేదిక ) ప్రాంగణాన్ని 154 ఎకరాల్లో సిద్ధం చేసింది. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స...