భారతదేశం, డిసెంబర్ 29 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులను తీసుకు వస్తుంది. సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం సూర్యుడు ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే బుధుడు, శుక్రుడు, కుజుడు కూడా ధనస్సు రాశిలో ఉన్నారు. దీంతో ఈ నాలుగు గ్రహాల సంయోగం ఏర్పడింది.

హిందూ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే, బుధుడు ధనస్సు రాశిలోకి డిసెంబర్ 29, అంటే ఈ రోజు ఉదయం 7:27కి ప్రవేశించాడు. బుధుడు, సూర్యుడు, శుక్రుడు, కుజ గ్రహాల సంచారం చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సూర్యుడు, శుక్రుడు, కుజుడు ధనస్సు రాశిలో ఉన్నారు. అలాగే బుధుడు కూడా ఈ రోజు ఉదయాన్నే ఈ రాశిలోకి ప్రవేశించాడు. బుధుడు ఈ రాశిలోకి ప్రవేశించడంతో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, ...