భారతదేశం, మే 5 -- ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 7 గంటల నాటికి కాకినాడ జిల్లా కాజులూరులో 100. 5మిమీ, చొల్లంగిపేటలో 94.5మిమీ, కరపలో 75.5మిమీ, కాకినాడలో 66.7మిమీ, కోనసీమ జిల్లా అమలాపురంలో 65.5మిమీ, ఏలూరు నిడమర్రులో 65.2మిమీ, తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో 65మిమీ,ఏలూరు ధర్మాజీగూడెంలో 64.5మిమీ వర్షపాతం చొప్పున భారీ వర్షాలు నమోదైంది

పలు జిల్లాల్లో 130చోట్ల 20మిమీ కంటే ఎక్కువ పిడుగులతో కూడిన మోస్తారు వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. అప్పటి వరకు ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడి పోయే పరిస్థితుల నుంచి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని వర్షం దంచి కొడుతోంది.

ఏపీలో మరో రెండు రోజుల వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పి...