భారతదేశం, జనవరి 14 -- భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (జనవరి 13, 2026) ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకటనలు, అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 250.48 పాయింట్లు (0.30%) నష్టపోయి 83,627.69 వద్ద, నిఫ్టీ 57.95 పాయింట్లు (0.22%) తగ్గి 25,732.30 వద్ద స్థిరపడ్డాయి.

ట్రంప్ హెచ్చరికలు - ఇరాన్ సంక్షోభం: ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ అధికారులతో అన్ని రకాల చర్చలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. "ఇరాన్ దేశభక్తులారా.. పోరాటం కొనసాగించండి. మీ సంస్థలను స్వాధీనం చేసుకోండి" అంటూ ఆయన చేసిన ట్వీట్ గ్లోబల్ మార్కెట్లలో ఆందోళన కలిగించింది. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ...