Hyderabad, జూలై 31 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 31.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: శ్రావణ మాసం : గురువారం, తిథి : శు. సప్తమి, నక్షత్రం : చిత్త

మేష రాశి వారికి ప్రతికూలతలు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టం మీద నెరవేరుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అందరితోనూ మితంగా సంభాషించండి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి.

నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. అవకాశాలు వదులుకోవద్దు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఓర్పుతో మెలగండి. ఖర్చులు విపరీతం. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిప...