Hyderabad, జూలై 30 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 30.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: శ్రావణ మాసం : బుధవారం, తిథి : శు. షష్టి, నక్షత్రం : హస్త

మేష రాశి వారికి వ్యాపారయోగం శుభప్రదం. లక్ష్య సాధనకు కాలం సహకరిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆర్థికంగా బలపడతారు. కొంత శత్రుదోషం ఉంది. బుద్ధిచతురతతో సంభాషించండి. ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.

వృషభ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. ఉన్నతస్థానానికి చేరుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలోని ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. శని బలం పరిపూర్ణంగా ఉంది. కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మహా...