Hyderabad, జూలై 29 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 29.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: శ్రావణ మాసం : మంగళవారం, తిథి : శు. పంచమి, నక్షత్రం : ఉత్తర

మేష రాశి వారి ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మీది, ఫలితం వేరొకదిగా ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు, కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, పనిభారం పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. శుభవార్తలు. స్వల్ప ధనలాభం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. శివపంచాక్షరి పఠించండి.

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కోర్టు కేసులు పరిష్కార దశకు ...