Hyderabad, జూలై 26 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 26.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: శ్రావణ, వారం : శనివారం, తిథి : శు. విదియ, నక్షత్రం : ఆశ్లేష

మేష రాశి వారికి ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. బంధు మిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. చేస్తున్న వృత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. అధికారుల ఒత్తిడి అధికమవుతుంది. వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృషభ రాశి వారికి వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. బంధు...