Hyderabad, జూలై 25 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 25.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: శ్రావణ, వారం : శుక్రవారం, తిథి : శు.పాడ్యమి, నక్షత్రం : పుష్యము

కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం, అనుకూలతలు అంతంత మాత్రమే. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు. ఖర్చులు విపరీతం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

వృషభ రాశి వారి కష్టం వృథా కాదు. శ్రమించే కొద్దీ ఫలితాలుంటాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయవద్దు. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారి తీస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి...