Hyderabad, జూలై 24 -- హిందుస్తాన్ టైమ్స్

రాశి ఫలాలు (దిన ఫలాలు) : 24.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : గురువారం, తిథి : కృ. అమావాస్య, నక్షత్రం : పునర్వసు

మేష రాశి వారు అవసరాలకు తగినంతగా డబ్బు అందుకుంటారు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆరోగ్యపరమైన చికాకులు కొంత బాధిస్తాయి. దూరపు బంధువుల సూచనలు పాటిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వృథా ఖర్చులు. తెలుపు, నీలం రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

వృషభ రాశి విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరా...