Hyderabad, జూలై 23 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 23.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : బుధవారం, తిథి : కృ. చతుర్దశి, నక్షత్రం : ఆర్ధ్ర

మేష రాశి వారు వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. గృహ వాతావరణం, వాహన సంబంధ విషయాలు కొంత అసౌకర్యంగా ఉంటుంది. నూతన వాహనాలు, గృహములు సంబంధించిన అంశముల మీద విస్తృతంగా దృష్టి సారిస్తారు. ఉన్నత స్థాయి. వ్యక్తులతో ఆశించిన విషయాలలో, ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన పనులలో సామాన్య ఫలితాలు, గురువులు పెద్దలు ఆశీర్వదనాలు, ఉన్నత విద్య కొరకు విదేశీ ప్రయాణాలకి కొంత అవకాశములు, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి.

ముఖ్యంగా విదేశాల లో ఉండే తోబుట్టువులు, స్నేహితులు సహకారం కూడా అందుకుంటారు. విద్యార్థులకు విద్యాసంబంధమైన విషయం మీద దృష్టి సారించాలి. వృత్...