Hyderabad, జూలై 22 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 22.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : మంగళవారం, తిథి : కృ. ద్వాదశి/త్రయోదశి, నక్షత్రం : మృగశిర

మేష రాశి వారు విజయాలు సాధిస్తారు. ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతస్థితి గోచరిస్తోంది. వ్యాపారంలో ప్రగతి ఉంటుంది. సృజనాత్మకమైన ఆలోచనలతో సమస్యల్ని సులువుగా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. రెండో రాశిలో ఉన్న శుక్రుడు ఆర్థిక ప్రయోజనాల్ని కల్పిస్తాడు. కనకధారాస్తవం పారాయణం చేయండి.

వృషభ రాశి వారికి లక్ష్మీయోగం శుభప్రదం. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. భవిష్యత్తులో రుణ సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. బుద్ధిబలంతో ఒత్తిళ్లను అధిగమించండి. ఆత్మీయులు, సహోద్యోగుల విషయంలో అపార్థాలకు తావివ్వకండి. లక్ష్య సాధన పైనే దృష్టి...