Hyderabad, జూలై 21 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 21.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : సోమవారం, తిథి : కృ. ఏకాదశి, నక్షత్రం : రోహిణి

కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. నిత్యం సర్పదోష నివారణ కంకణం ధరించడం వలన సర్వదోషాలు తొలగిపోతాయి. దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీద మీరు చేసుకుపోవడం వలన సానుకూల ఫలితాలను సాధిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.

వృషభ రాశి వారు అనుకూల ఫలితాలను ఎక్కువగా సాధించగలుగుతారు. న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్న మీవారిని రక్షించవలసిన బాధ్యత మీపై పడుతుంది. ఆర్థికంగా పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతవరకు ఊరటను చెందుతారు. కాలం అనుకూలంగా మారుతున్నట్లుగా భావిస్తారు. నిత్యం దీపారాధన కుందిలో రెండు చుక్కలు పరిశ...