Hyderabad, జూలై 20 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 20.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : ఆదివారం, తిథి : కృ. దశమి, నక్షత్రం : కృత్తిక

మేష రాశి వారి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య యత్నాలకు మద్దతు లభించగలదు. గృహంలో సందడి వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో నూతన ఒప్పందాలు పూర్తిచేసుకుంటారు. విద్యార్థులకు వ్యాసంగాలు అనుకూలంగా సాగుతాయి. ఆహార, విరామాలకు కాలనియమాలు పాటించండి. ఉద్యోగులకు గుర్తింపులు ఉంటాయి.

వృషభ రాశి వారు మానసికంగా సంతృప్తిని పొందుతారు. కుటుంబ వ్యక్తులతో ఉత్సాహాలు, ఆలోచనలు పంచుకుంటారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వాహన, యంత్రాదుల రిపేర్లను ఏర్పరచు సూచనలున్నాయి. వృ...