Hyderabad, జూలై 17 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 17.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : గురువారం, తిథి : కృ. సప్తమి, నక్షత్రం : రేవతి

ఈ రాశి వారికి ఈ రోజు గ్రహసంచారాలు మిశ్రమంగా ఉపకరిస్తాయి. కుటుంబంలో సామరస్యతలు కొనసాగుతాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా అనుకూలతలు ఉంటాయి. సమాచారం ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు స్పష్టత ఉండేటట్లు జాగ్రత్త వహించండి. వృత్తి, ఉద్యోగాల పట్ల అంకితభావాలు అవసరమౌతాయి. మిత్ర, బంధువర్గపు సహకారాలు తీసుకోండి. సంతాన విషయంలో సర్దుకు పోవలసి రావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు టార్గెట్లు పెట్టుకొని యత్నించుకోవాలి.

ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబంలో ఏకవాక్యతలతో అన్నింటా ఉత్సాహంగా సాగగలరు. అవసరాలను సమర్థించుకునేటట్లు ఆదాయాలు ఉంటాయి. మంచి ఆలోచనలను సకాలంలో చేయగలుగుతారు. ఉన్నత ఉద్యోగ,...