Hyderabad, జూలై 16 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 16.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : బుధవారం, తిథి : కృ. షష్టి, నక్షత్రం : పూర్వాభాద్ర/ఉత్తరాభాద్ర

మేష రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలలో, వాగ్వాదాలలో, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యానికి తగిన శ్రద్ధ తీసుకోవాలి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక విషయాలు, మైత్రి బంధాలు సాధారణంగా ఉంటాయి. వైరాగ్యాన్ని అధిగమించాలి. వృత్తిపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్లాలి. ఆధ్యాత్మికత పెరుగుతుంది.

దైవచింతన, సంకల్పబలంతో అనుకున్నది సాధిస్తారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో ధనరాబడి, తండ్రి ఆరోగ్యం, ఆకస్మిక విషయాలు, ఉన్నత విద్య, వ్యాపార వ్యవహారాలు కొంత అంతరాయాన్ని, అశాంతిని కలిగిస్తాయి. నిర...