Hyderabad, జూలై 15 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 15.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : మంగళవారం, తిథి : కృ. పంచమి, నక్షత్రం : శతభిష

మేష రాశి వారికి అత్యుత్తమ సమయం. ఆశయం నెరవేరుతుంది. కాలం కలిసొస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతిభను కనబరుస్తారు. ప్రస్తుత పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలను కురిపిస్తాయి. ఏలినాటి శని ప్రభావం ఉంది, కాబట్టి ఆచితూచి అడుగేయాలి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల భాగస్వామ్యం అవసరం. లక్ష్మీ అష్టోత్తరం పఠించండి.

అదృష్టయోగం కొనసాగుతోంది. శుభాలు జరుగుతాయి. ఆర్థిక ఫలితాలు అనుకూలం. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆశయాలు నెరవేరతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. సున్నితంగా సంభాషించండి. ఆరంభశూరత్వం పనికిరాదు. మహాలక్ష్మిని ధ్యానించండి....