Hyderabad, జూలై 14 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 14.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : సోమవారం, తిథి : కృ. చవితి, నక్షత్రం : ధనిష్ట

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా పురోగతి బాగుంటుంది. వృత్తి, వ్యాపారములు, రాజకీయ పరమైన వ్యవహారములు అనుకూలిస్తాయి. ఆత్మీయుల వలన మానసికంగా కొంత అశాంతి ఉంటుంది. నిత్యం యజ్ఞ భస్మాన్ని ధరించడం వలన యజ్ఞము చేసిన ఫలితం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడిపోయి ఊపిరి పీల్చుకుంటారు.

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన మార్పులు, చేర్పులు కలిసి వస్తాయి. ప్రజాధరణ బాగుంటుంది. ప్రచార సంబంధాలు మెరుగుపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్పగణపతి పీఠానికి పరిమళగంధం రాసి, ఆరావళి కుంకుమ పెట్టి నిత్యం పూజ చేయటం వలన సమస్యలు కొంతవరకు తీరు...