Hyderabad, జూలై 13 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 13.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : ఆదివారం, తిథి : కృ. తదియ, నక్షత్రం : శ్రవణ

మేష రాశి వారు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తాయి. ఆసక్తికర సమాచారం నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. వాహనయోగం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మందగించినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. ధనవ్యయం, కుటుంబంలో చికాకులు. నలువు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

వృషభ రాశి వారికి పనులు కొన్ని శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు ఉండదు. భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ముఖ్య వ్యవహారాలలో ని...