Hyderabad, జూలై 12 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 12.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : శనివారం, తిథి : కృ. విదియ, నక్షత్రం : ఉత్తరాషాడ

మేష రాశి వారు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వరుస విజయాలు సిద్ధిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆత్మీయుల విషయంలో క్షమాగుణం అవసరం. వ్యాపార ప్రయత్నాలు కలిసొస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. దుర్గామాతను స్మరించండి.

వృషభ రాశి వారు లాభాలను అందుకుంటారు. శుభాలు జరుగుతాయి. గృహయోగం ఉంది. ప్రారంభించిన పనులను వాయిదా వేయకండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు ఆస్కారం ఉంది. సున్నితంగా వ్యవహరించండి. ఉద్యోగ బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించండి. డబ్బును వృథా చేయకండి. మహాలక్ష్మిని ధ్యానిం...