Hyderabad, జూలై 10 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 10.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : గురువారం, తిథి : పౌర్ణమి, నక్షత్రం : పూర్వాషాడ

మేష రాశి వారు తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసహాయం తగదు. చెల్లింపులో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. మానసికంగా కుదుట పడతారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది.

వృషభ రాశి వారి పరిస్థితులు చక్కబడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఫైనాన్స్, చిట్స్ రంగాల జోలికి...