Hyderabad, జూలై 8 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 08.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : మంగళవారం, తిథి : శు. త్రయోదశి, నక్షత్రం : జ్యేష్ఠ

మేష రాశి సంతానమునకు అభివృద్ధి, ఆర్థిక విషయాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక విషయాలు, పోటీలు అనుకూలం, పుణ్యాలను పెంచుకుంటారు. వృత్తి సంబంధమైన ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సంభాషిస్తారు. ఆహార నియమాలు పాటించాలి. సోదర వర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి.

వృషభ రాశి వారు పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలకు దూరంగా ఉండాలి. అసౌకర్యంగా ఉంటుంది, ప్రశాంతత తక్కువ, రిపేర్ల కొరకు శ్రద్ధ. స్త్రీ...