Hyderabad, జూలై 7 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 07.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : సోమవారం, తిథి : శు. ద్వాదశి, నక్షత్రం : అనూరాధ

మేష రాశి వారి పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం నిరాటకంగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను తీసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. సాయిబాబా ఆలయాన్ని సందర్శించండి.

వృషభ రాశి వారు సహోద్యోగులతో, అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. భక్తి పెరుగుతుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన విషయాల జోలికి వ...