Hyderabad, జూలై 6 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 06.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : ఆదివారం, తిథి : శు. ఏకాదశి, నక్షత్రం : విశాఖ

మేష రాశి వారికి ఈ రోజు నూతన విషయాలు తెలుసుకుంటారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది. ఇతరుల విషయంలో జోక్యం తగదు. మహాతీర్థం పొడితో చేసే అభిషేకాలు, స్వశక్తితో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. రాజకీయ, కళా, పారిశ్రామిక, క్రీడా రంగాలలోని వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు.

వృషభ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో కొంతవరకు తొలగుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. నిత్యం దైవ కార్యక్రమాలలో ప్రధను...