Hyderabad, జూలై 5 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 05.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : శనివారం, తిథి : శు. దశమి, నక్షత్రం : స్వాతి

మేష రాశి వారు ఈ రోజు భూముల, షేర్ల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నిత్యం మహాపాశుపత కంకణం ధరించడం వలన మేలు జరుగుతుంది.

వృషభ రాశి వారికి ఈ రోజు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఋణాలు తీరి ఊరట చెందుతారు. సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపడకండి. వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. కీలక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నిత్యం లక్ష్మీ తామర వత్...