Hyderabad, జూలై 3 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 03.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : గురువారం, తిథి : శు. అష్టమి, నక్షత్రం : హస్త

మేష రాశి వారి కృషి స్పూర్తిదాయకంగా ఉంటుంది. లావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పెద్ద ఖర్చులు అయ్యే అవకాశం ఉంది, చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్త యత్నాలు మొదలుపెట్టతారు. సన్నిహితులతో మాట్లాడతారు. ఒక సమాచారం ఆలోచన రేపుతుంది. నిపుణులను సంప్రదిస్తారు. పెద్దల సహాయంతో సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల విద్యలో మంచి ఫలితం. దూరప్రయాణానికి అవకాశం ఉంటుంది.

వృషభ రాశి వారు మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. అవకాశాలను తక్షణమే అందిపుచ్చుకోవాలి. అనుమానాలకు తావివ్వకండి. పొదుపు అలవర్చుకుంటారు, ఖర్చులు పెరుగుతాయి. ప్రారంభంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. అనవసర విషయ...