Hyderabad, జూలై 2 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 02.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : బుధవారం, తిథి : శు. సప్తమి, నక్షత్రం : ఉత్తర

మేష రాశి వారికి శుభప్రదమైన కాలం. ఆర్థిక ఫలితాలు బావుంటాయి. ఆత్మీయుల సూచనలను పరిగణనలోకి తీసుకోండి. ఉద్యోగులు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. గతంలోని సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో కొద్దిపాటి అవరోధాలు ఉన్నాయి. బుద్ధిచతురతతో వాటి నుంచి తప్పించుకోవాలి. శ్రీ మహావిష్ణువును ధ్యానించండి.

వృషభ రాశి వారికి శుభకాలం గోచరిస్తోంది. గురుబలం వల్ల అదృష్టయోగం తోడవుతుంది. వ్యాపారంలో తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. మొహమాటం కారణంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. వ్యయాలను అదుపులో ఉంచుకోండి. వివాదాస్పద చర్చల జోలికి వెళ్లకండి. మనోబలంతో ఒత్తిడిని జయించండి. శ్రీ మహాల...