Hyderabad, జూలై 1 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 01.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : మంగళవారం, తిథి : శు. షష్టి, నక్షత్రం : పుబ్బ

మేష రాశి వారికి వ్యక్తిగత గౌరవం, స్థాయి పెరగడం, ఇతరులపై సరైన అవగాహన దృక్పథం కలిగి వారి అభిమానం పొందుతారు. ఉన్నత విద్యా విషయాలలోనూ ముందంజ వేస్తారు.

వృషభ రాశి వారికి ఇతరులతో స్నేహపూర్వకమైన ధోరణి అవసరం. తలనొప్పి, కంటి సమస్యలతో వైద్యుని సంప్రదిస్తారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

మిథున రాశి వారు స్నేహితులు, బంధువులు, తోబుట్టువులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. మీ మనస్సు ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఎక్కువగా ఉండాలని కోరుకుంటుంది.

కర్కాటక రాశి వారు వృత్తి వ్యాపారాలలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ప్రోత...