Hyderabad, జూన్ 30 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 30.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : సోమవారం, తిథి : శు. పంచమి, నక్షత్రం : మఖ

మేష రాశి వారికి ఈ రోజులో బంధుమిత్రులతో ఉత్సాహంగా వ్యవహరించుకోగలరు. సంతానసంబంధంగా కోరుకున్నవి పూర్తికాగలవు. అనవసర ఖర్చులు పెరగకుండా ఆర్థిక అవసరాలపట్ల జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. కుటుంబ వ్యవహారాల్లో సంయమనం అవసరం. వస్తు కొనుగోళ్ళు, అమ్మకాలు నిరాశలేర్పరచగలవు. కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు ఇతరులను ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. ప్రయాణాలు ప్రయోజనం ఇస్తాయి.

వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్తవైన హోదాలు, అదనపు బాధ్యతలు వంటివి ఏర్పడగలవు. గృహ, కుటుంబ వ్యక్తులకు ఆచరణ, అలంకరణలు ఏర్పరచగలరు. వాహన మార్పులు ప్రధాన భూమిక వహించగలవు. ఆదాయాల్లో మిగులు శాతములు ...