Hyderabad, జూన్ 28 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 28.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : శనివారం, తిథి : శు. తదియ, నక్షత్రం : పుష్యమి

మేష రాశి వారు సంతోషకరమైన వార్త వింటారు. అన్నివిధాలా ప్రోత్సాహకరం. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ చిత్తశుద్ధి ప్రశంసనీయమవుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. అర్దాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు.

వృషభ రాశి వారు ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. మీ వ్యక్తిత్వమే మిమ్ములను కాపాడుతుంది. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు....