Hyderabad, జూన్ 26 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 26.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : గురువారం, తిథి : శు. పాడ్యమి, నక్షత్రం : ఆర్ధ్ర

మేష రాశి వారికి శుభప్రదమైన కాలం. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. జన్మ శుక్రయోగం ఆర్థిక ప్రగతికి వీలు కల్పిస్తుంది. ఏకాదశ రాహుయోగం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని కోల్పోకండి. వినయ విధేయతలు పెంచుకోండి. శ్రీ మహావిష్ణువును ధ్యానించండి.

శుభకాలం కొనసాగుతోంది. సృజనాత్మకత పెరుగుతుంది. ఆశయ సాధనలో ముందుంటారు. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఆ సొమ్మును సత్కార్యాలకు మళ్లించాలి. కీలక సందర్భాల్లో ఆత్మవిశ్వాసం ముఖ్యం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఒత్తిడిని జయిస్తారు. శుభవార్తలు వింటారు....