Hyderabad, జూన్ 21 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 21.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : శనివారం, తిథి : కృ. ఏకాదశి, నక్షత్రం : అశ్విని

మేష రాశి వారికి ధైర్య, సాహసాలు పెరుగుతాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆత్మీయులైన ఇతరులకు సహకరిస్తారు. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆలోచనలు ముందుకు వెళతాయి. సంతానము డైనమిక్‌గా ఉంటుంది. కుటుంబంలో వ్యక్తులతో విభేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికం.

ఆశించిన పనులలో విజయాన్ని సాధిస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఉన్నత ఆలోచనలతో లక్ష్యాలు సాధించేందుకు ధైర్యంగా ముందడుగు వేస్తారు. సృజనాత్మకత అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సందర్శన మేలు.

వృషభ రాశి వారికి గృహ వాతావరణం, కుటుంబంలోని సౌక...