Hyderabad, జూన్ 20 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 20.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : శుక్రవారం, తిథి : కృ. నవమి/దశమి, నక్షత్రం : రేవతి

మేష రాశి వారికి ఈ రోజు తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఖర్చులు విపరీతం. కష్టసమయంలో ఆప్తులు ఆదుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

వృషభ రాశి వారికి ఈ రోజు శ్రమించిన కొద్దీ మంచి ఫలితాలు ఉంటాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. దృఢసంక...