Hyderabad, జూన్ 18 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 18.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : బుధవారం, తిథి : కృ. సప్తమి, నక్షత్రం : పూర్వాభాధ్ర

మేష రాశి వారికి ఈ రోజు కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలతో చేపట్టిన అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సంతానపు వ్యవహారాలు కొన్ని చికాకుపరుస్తాయి. ఆలోచనలను ఆత్మీయులతో పంచుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చెల్లింపులను పూర్తిచేసుకోగలుగుతారు. ఆదాయాలు, ఆరోగ్యం పరవాలేనివిగా ఉంటాయి. విద్యార్థులకు రోజులు ఉపకరించగలవు.

వృషభ రాశి వారు ప్రయత్నాలను ఉత్సాహంగా నిర్వహించుకోగలరు. అవకాశాలు కలసివస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ నిర్ణయాలు గుర్తింపునేర్పరచగలవు. నూతన పనులకు శ్రీకారం చుట్టగలరు. రావలసినవి వసూలగుట, ఇతరులకు సహకరించుట ఉంటాయి. భూ, గృహ క్...