Hyderabad, జూన్ 17 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 17.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ఠ, వారం : మంగళవారం, తిథి : కృ. షష్ఠి, నక్షత్రం : శతభిష

మేష రాశి వారికి ఈ రోజు విజయం లభిస్తుంది. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నం ఆపకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తొందరపాటు చర్యలు వద్దు. ఒత్తిడికి గురికాకండి. అవరోధాలు సృష్టించే వారితో జాగ్రత్త. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. పట్టువిడుపులతో వ్యవహరించండి. సూర్యుడిని ధ్యానించండి.

వృషభ రాశి వారికి ఈ రోజు శుభకాలం కొనసాగుతోంది. కీలక నిర్ణయాలకు సరైన సమయం. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. దైవబలం సహకరిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రశంసలు అందుతాయి. అవసరానికి తగినంత డబ్బు సమకూరుతుంది. రుణ సమస్యలతో ...