Hyderabad, జూన్ 16 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 16.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ఠ, వారం : సోమవారం, తిథి : కృ. పంచమి, నక్షత్రం : ధనిష్ఠ

మేష రాశి వారు ఉపయుక్తంలేని సంభాషణలు చర్యలకు ఏమాత్రం తావివ్వరు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గృహం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు బలపడతాయి. పనిభారం వలన వత్తిడికి లోనవుతారు. ముఖ్యమైన డైరీ సకాలంలో కనిపించక తాత్కాలికంగా చికాకు పడుతారు. నిత్యం సుబ్రమణ్య పశుపతి కంకణం ధరించండి.

వృషభ రాశి వారికి ఈ రోజు దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. నిత్యం దీపారాధన కుందిలో రెండు చుక్కలు పరిమళ గంధాన్ని వేయాలి. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖుల కలయిక, ప్రకృతి వైద్యం, యోగా వంటి సనాతన ఆరోగ్...