Hyderabad, జూన్ 15 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 15.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ఠ, వారం : ఆదివారం, తిథి : కృ. చవితి, నక్షత్రం : శ్రవణ

మేష రాశి వారికి ఈ రోజు ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం కలుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా సాగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృథా ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.

వృషభ రాశి వారికి ఈ రోజు స్నేహితుల సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూర...