Hyderabad, జూన్ 13 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 13.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : శుక్రవారం, తిథి : కృ. విదియ, నక్షత్రం : పూ. ఆషాడ

మేష రాశి వారికి ఈ రోజు గ్రహ సంచారాలు ప్రతికూలంగా ఉన్న మిశ్రమ స్థితులను చూడగలరు. ముఖ్యమైన వ్యవహారాల్లో కదలికలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఆరోగ్య, ఆర్థికాలు సామాన్యంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగులకు పనిభారములు ఎక్కువ. విద్యార్థులు, నిరుద్యోగులు నిరుత్సాహం ఏర్పరచుకోకుండా వ్యవహరించుకోవాలి. భూక్రయ విక్రయాలు ముందుకు సాగుతాయి. తప్పనిసరి ఆధ్యాత్మికతలకు ప్రాధాన్యతను ఇచ్చుకోండి.

ఆలోచనలను కార్యరూపంలో పెట్టగలరు. అవకాశాలు కలసివస్తాయి. శ్రమకు తగిన గుర్తింపులు లేకపోయినా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. వివాహాది శుభాల స్థిరీకరణలు, కొందరికి నిశ్చితార్థములు పూర్తవుతాయి. అనార...