Hyderabad, జూన్ 14 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 14.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : శనివారం, తిథి : కృ. తదియ, నక్షత్రం : ఉ. ఆషాడ

మేష రాశి వారు ఈరోజు ఏ వ్యవహారమైనా చక్కదిద్ది ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన రావచ్చు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు. కళారంగం వారికి శ్రమ ఫలిస్తుంది. ధన వ్యయం. గులాబీ, నేరేడు రంగులు, నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

వృషభ రాశి వారు చేపట్టిన పనుల్లో కొంత ఇబ్బంది ఏర్పడినా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగుపడుతుంది. అయితే ఖర్చులు తగ్గించుక...