Hyderabad, జూన్ 12 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 12.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : గురువారం, తిథి : కృ. పాడ్యమి, నక్షత్రం : మూల

మేష రాశి వారు ఈ రోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ముఖ్య విషయాలపై చర్చలు సాగిస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు, వాహనయోగం. బంధువుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలలో చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. రాజకీయ వర్గాల శ్రమ ఫలిస్తుంది. వ్యయప్రయాసలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యస్తుతి మంచిది.

వృషభ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. భూ వివాదాలు కొంతమేర పరిష్కారమవుతాయి. వేధ...